మన్యం న్యూస్ చండ్రుగొండ, ఏప్రిల్ 15: అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం అయ్యన్నపాలెం-బాలికుంట గ్రామాల రహదారి నిర్మాణ పనులను బిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… గిరిజన ప్రాంతాల అభివృద్ధి నిధులు రూ.1.80కోట్లతో 2.7 కిలోమీటర్ల బిటిరోడ్డు మంజూరైందని, దీనికి అశ్వరరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు కృషి ఎంతో ఉందన్నారు. ఎమ్మేల్యే సహకారంతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటామన్నారు. అన్ని పంచాయతీల్లో సీసీరోడ్లకు నిధులు ఇచ్చిన ఏకైక శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బెండాలపాడు పంచాయతీ సర్పంచ్ పూసం వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్. సీనియర్ నాయకులు మేడా మెహన్ రావు , భూపతి రమేష్, సూర వెంకటేశ్వర్లు,చాపలమడుగు రామరాజు,నరకుళ్ల వాసు, అంగోత్ లక్ష్మణ్, వంకాయలపాటి బాబురావు,తదితరులు పాల్గొన్నారు.