మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం పరిధిలోని బాలాజీనగర్ లో నివాసం ఉంటున్న జర్రిపోతుల శాంతమ్మ పై అదే ఏరియాకు చెందిన కొంత మంది దాడి చేసిన ఘటన శనివారం జరిగింది.ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శాంతమ్మ కు పక్కింట్లో ఉంటున్న కళ కు గతం నుంచి మనస్పర్ధలు ఉన్నాయి. శాంతమ్మ కు భర్త తో గొడవకు కారణం కళ చెప్పుడు మాటలే అంటూ వారిరువురు తరుచూ గొడవ పడేవారు.శనివారం మాటామాటా పెరిగి పెద్ద గొడవ జరిగి దెబ్బలాట వరకు దారి తీసింది.తిరుమల కళ కు సపోర్ట్ గా అరుణ, మీనా,మహేష్, కల్యాణి, ఎస్కే యాకూబ్ తదితరులు శాంతమ్మ పై కూతురు సృజన పై దాడి చేసినట్లుగా స్థానికులు తెలిపారు. దాడిలో గాయపడి సొమ్మసిల్లి పడిపోయిన శాంతమ్మను స్థానిక సర్పంచ్ పాయం ఆంజనేయులు 108 లో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.