UPDATES  

 2024 ఎన్నికల్లో గెలిచేది మనమే.. దేశవ్యాప్తంగా దళిత బంధు సీఎం కేసీఆర్

2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఏదైనా చెప్పడానికి విశ్వాసం ఉండాలన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ వద్ద బీఆర్ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహన్ని అవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కు ఊహించని ఆదరణ కనిపిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో వస్తోన్న ఆదరణరను చూసి తాను షాక్ అయ్యానన్న సీఎం భవిష్యత్తులో యూపీ, బిహార్ లో కూడా ఆదరణ వస్తుందని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తోన్న దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా దేశమంతా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
తెలంగాణలో ఇప్పటికే 50 వేల మందికి దళితబంధు ఇచ్చామని, మరో 25 వేల మందికి దళితబంధు అందించనున్నామని చెప్పుకొచ్చారు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు చివరి రక్తపు బొట్టు వరకు కృషి చేస్తానని సీఎం చెప్పారు. అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరణ తన చేతుల మీదుగా చేయడం అదృష్టం గా భావిస్తున్నాని కేసీఆర్ తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !