మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 16
పినపాక మండలం బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రదాన కార్యదర్శి చెన్నకేశవులు తండ్రి ఆంజనేయులు ద్విచక్ర వాహనదారులు ఢీకొనడంతో చేయి విరగడం జరిగింది. చేయికి అపిరేషన్ చేసేందుకు ఓ పాజిటివ్ బ్లెడ్ అత్యవసరం కావడంతో రేగా బ్లెడ్ బ్యాంక్ గ్రూప్ లో బ్లెడ్ కావాలని మెసేజ్ పెట్టడంతో మానవత్వంతో బిఆర్ఎస్ పార్టీ అశ్వాపురం సోషల్ మీడియా మండల అధ్యక్షులు ప్రశాంత్ యాదవ్ వెంటనే స్పందించి,మణుగూరు హాస్పిటల్ లో రేగా బ్లెడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదానం చెయ్యటం జరిగింది.ఈ సందర్భంగా ప్రశాంత్ యాదవ్ మాట్లాడుతూ,రేగా సైనికులుగా నిరంతరం ప్రజల సేవకై పాటుపడతామన్నారు.ఇప్పటికే ఎంతో మందికి అరే రేగా బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేసి, వారి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు.భవిష్యత్తులో కూడా రేగా బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు ఎల్లప్పుడూ సేవలందించడంలో ముందుంటామన్నారు.