UPDATES  

 సింగరేణి లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో అమ్మ నాన్న వృద్ధాశ్రమానికి కూలర్ అందజేత -వృద్ధులకు పండ్లు పంపిణీ

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: ఏప్రిల్ 16

సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో బండారుగూడెం లోని ఉడతాని గుంపులోని అమ్మ నాన్న వృద్ధాశ్రమానికి కూలర్ అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఏరియా సేవా అధ్యక్షురాలు దుర్గం సుమతి రామచందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,సింగరేణి లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలోనే సుమారు 3 లక్షల రూపాయలతో పలు సామాజిక సేవా కార్యక్రమాలతో,క్లబ్ సభ్యులందరూ చురుకైన పాత్ర పోషిస్తున్నారని,అదే స్ఫూర్తితో వేసవి నేపథ్యంలో వృద్ధుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అమ్మ నాన్న వృద్ధాశ్రమానికి కూలర్ అందజేయటం,అభినందనీయమని క్లబ్ సభ్యులను ఆమె అభినందించారు.సామాజిక సేవ నిర్వహించాలనే దృక్పథంతో పాటు,మనం అందించే సేవ అర్హులకు అందాలని,అప్పుడు మాత్రమే సేవకు నిజమైన సార్ధకత ఏర్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.స్థానిక సామాజిక కార్యకర్త భూక్య తారా ప్రసాద్ దంపతులు చిన్న వయసులోనే పెద్ద ఆశయంతో వృద్ధాశ్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని వారిని ప్రశంసించారు.తమ సభ్యుల తోడ్పాటు ఎల్లవేళలా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.ఏరియా సేవా అధ్యక్షురాలి హోదాలో తొలిసారి వృద్ధాశ్రమాన్ని సందర్శించిన సందర్భంగా నిర్వాహకులు తారా ప్రసాద్ వృద్ధుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథి సుమతి రామచందర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం లో లేడీస్ క్లబ్ కార్యదర్శి ప్రముఖ జర్నలిస్ట్ డి.అనితా లలిత్ కుమార్,సువర్ణ. నాగేశ్వర్ రావు,కవిత శ్రీనివాస్ చారి,స్వర్ణ శ్రీనివాస్,శోభ రాజిరెడ్డి,సరిత శ్రీనివాస్, అరుణ రాజేంద్రప్రసాద్,ఫ్యానీ వెంకటేశ్వర్లు,లక్ష్మి కిషన్ రాం. సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్ పాషా,నాని తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !