మన్యం న్యూస్, మంగపేట.
ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ అత్యవసర సమావేశం చుంచు పల్లి గ్రామం లో నిర్వహించటం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి మలకం సమ్మయ్య మాట్లాడుతూ,
మంగపేట మండల కేంద్రం లోని గంపోనిగుడెం గ్రామం లో జాతీయ రహదారి ప్రక్కన గల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా,
అందులో అక్రమంగా ఇల్లు నిర్మించుకొన్న పగిడిపెల్లి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అట్టి భూమి విషయం లో గొప్ప వీరయ్య పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, తన వ్యక్తి గత స్వార్దం కోసం మిగతా వారిని అందరిని ఎగేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇట్టి భూమి విషయం లో రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి అతడిని ఆ స్థలం నుండి ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు.
లక్షలాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములని కబ్జా చేస్తూ , వెరేకొకరు డబ్బు లు పెట్టి కొనుక్కున్న భూమిని ఆక్రమించుకోవడం దారుణమని అన్నారు. రెవెన్యూ అధికారుల ను ప్రలోభాలకు గురి చేసి అట్టి భూమి నీ రాత్రి కి రాత్రి కబ్జా చేశారని, ఒక ఆదివాసీల శ్రేయస్సు కోసం, బడుగు బలహీనవర్గాల కోసం పని చేసే నాయకుడి
పై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు.
గొప్ప వీరయ్య కి పగిడిపల్లి వేంకటేశ్వర్లు బహిరంగ క్షమాపణ లు చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు, ఎట్టి రాజబాబు,
ఊకే జగ్గారావు, కాపుల సమ్మయ్య, వట్టం సురేష్, కబ్బాక రామన్న తదితరులు పాల్గొన్నారు.