మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
తునికాకు కార్మికులకు 2016 సంవత్సరం నుంచి 2022 వరకు పెండింగ్ లో ఉన్న బోనస్ వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు, బుర్రి ప్రసాద్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో తునికాకు బోనస్ రూ.233 కోట్ల రూపాయలు గత ఏడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నదని, ప్రభుత్వం రూ.233 కోట్ల రూపాయలు విడుదల చేసినా ఇంతవరకు లబ్దిదారులకు డబ్బులు చెల్లించలేదు న్నారు, తునికాకు బోనస్ చెల్లించకపోతే ఆకు సేకరణ ఆపివేస్తామని వారు హెచ్చరించారు, ఇప్పటికే జిల్లా లో తునికాకు ప్రూనింగ్ పనులు పూర్తి చేసి,ఆకు కోతకు సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ వెంట వెంటనే స్పందించి తునికాకు కార్మికులకు బోనస్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన, గిరిజనేతర పేదలకు రెండవ పంట గా తునికాకు సేకరణ ఉంటుందన్నారు,ఆ పని ద్వారా వారి కుటుంబ జీవనాధారం కోసం కొంత ఆర్థిక తోడ్పాటు ఏర్పడుతుందని అన్నారు,
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్,బి.చిరంజీవి, కిరణ్, వినోద,వెంకన్న, ముదిగొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.