మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 16: అశ్వారావుపేట నియోజకవర్గంలోని 5 మండలాల్లో పలు చోట్ల అంగన్ వాడి భవనాలు లేక ఇబ్బందీ పడుతుండటంతో వాటిపై ప్రత్యేక చొరవతో ఎమ్మెల్యే మెచ్చా భవనాల కొరకు, బిటీ రోడ్లు తదితర సమస్యల పై మంత్రి సత్యవతి రాథోడ్ నీ ఆదివారం హైద్రాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ నియోజక వర్గ వ్యాప్తంగా సమస్యలు వెతికి పట్టుకొని పరిష్కరించే విదంగా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.