మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలోని యుపిఎస్ పాండురంగాపురం పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న చాంద్ బేగం పేద విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేశారు. చదువులో ముందుండి నిరుపేద కుటుంబం, అనాధ పిల్లలకు దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ , గ్రామ పంచాయితీ సర్పంచ్ ఈసం భవతి , ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, పంచాయతీ సెక్రటరీ, అంగన్వాడి కార్యకర్త ,గ్రామస్తులు పాల్గొన్నారు.