కిన్నెరసాని మంచినీరు ప్రతిరోజు సరఫరా చేయాలి
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
మన్యం న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
కిన్నెరసాని మంచినీరు ప్రతిరోజు సరఫరా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన మహిళా కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పట్టణంలో రోజుల తరబడి కిన్నెరసాని త్రాగునీరు రాక మంచినీరు కోసం ప్రజలు అల్లాడుతుంటే ఎమ్మెల్యే,అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని,పాలకుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందని విమర్శించారు.స్థానిక ఎమ్మెల్యే కిన్నెరసాని మంచినీటి సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్య పరిష్కారానికి రూ.130 కోట్లు నిధులు మంజూరు అవుతున్నాయని ప్రకటించి నెలలు గడుస్తున్నా నేటికి రూపాయి కూడా మంజూరు కాలేదన్నారు.కిన్నెరసాని రెండవ లైన్ పనుల్లో జరుగుతున్న జాప్యం పై జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని కిన్నెరసాని మంచినీరు ప్రతిరోజూ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు
ఈకార్యక్రమంలో అసెంబ్లీ మహిళా కన్వీనర్ కోలా మల్లికా,కేతిని కుమారి,ఎర్రంశెట్టి రాజేశ్వరి,లక్ష్మీ, శారద* తదితరులు పాల్గొన్నారు