మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ లను వారి యొక్క 15 సంవత్సరాల ఆకాంక్ష 12 నెలల జీతాలు సాధనలో కృషిచేసి జీతాలు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన పిఆర్టియు ఉపాధ్యాయ సంఘానికి ఎంతో రుణపడి ఉంటామని కాంటాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు కృతజ్ఞతలు తెలిపారు. సిఆర్టి నాయకులు పిలుపునిచ్చిన వెంటనే స్పందించి సకాలంలో ఆర్థిక సహాయం చేసి సభ విజయవంతానికి పెద్ద మొత్తంలో హాజరై సభను విజయవంతం చేసిన సిఆర్టి సోదరులకు పేరుపేరునా ధన్యవాదములు తెలుపుతూ ఎంతో బిజీ కార్యచరణలో ఉండి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన కార్యక్రమానికి విచ్చేసి మనకు ఆశీర్వాదాలు అందించి అండగా ఉంటామని అభయమిచ్చిన పి ఆర్ టి యు ఎమ్మెల్సీ కూర రఘోతం రెడ్డి కి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ పాల్ రెడ్డి , బీరెల్లి కమలాకర్ రావు ఈ కార్యక్రమంలో వెన్నంటి ఉండి అనేక రకాల సలహాలు సహాయ సహకారాలు అందించి కార్యక్రమం విజయవంతానికి ప్రధాన భూమిక పోషించినటువంటి పీఆర్టీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి వెంకటేశ్వరరావు , బి రవి పి ఆర్ టి యు రాష్ట్ర జిల్లా మండల బాధితులకు ఐటిడిఏ విభాగం నాయకులకి ఇన్చార్జిలకి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరుపున ఈ కార్యక్రమంలో అజ్మీర శివలాల్, గుగులోతు రూప్లా నాయక్, లక్ష్మణ్ నాయక్, భావ సింగ్, రవికుమార్, పసుపులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు