మన్యం న్యూస్,ఇల్లందు టౌన్..ఎండలు విపరీతంగా ఉండటంతో పనివేళలు మార్చాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇఫ్టు అనుబంధం ఆధ్వర్యంలో ఇల్లందు మున్సిపల్ కమిషనర్ కు శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో టీపీయండబ్ల్యుయూ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి పాల్గొని మాట్లాడుతూ…మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు ఎండలు ఎక్కువగా ఉండటం వలన తీవ్రఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని కావున పనివేళలు మార్చాలని మున్సిపల్ కమిషనర్ అంకుషావలికి వినతిపత్రం అందించారు. అదేవిధంగా తడి, పొడి చెత్త కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని, సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బోయపోతుల వెంకన్న, మహేష్, సంపత్, సంజీవ్, రఫీ, పాష, రాజు, రాజమ్మ , గురునాథం తదితరులు పాల్గొన్నారు.