మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
తునికి ఆకు బోనస్ మంజూరు చేయకపోతే ఈ ఏడాది ఆకు కోసేది లేదని సిపిఎం పార్టీ రాష్ట్ర సభ్యులు మాజీ ఎంపీ మీడియం బాబురావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం మండలంలోని ఎలమంచి సీతారామయ్య భవనంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏడు సంవత్సరాల నుంచి తునికి ఆకు బోనస్ బకాయి చెల్లించడం లేదని వెంటనే కార్మికుల అకౌంట్లో బోనస్ జమ చేయాలని లేనిపక్షంలో ఈ ఏడాది తునికాకు కోసేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు హక్కుపత్రాలు సర్వే చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పట్టాలు ఇవ్వడం లేదని వెంటనే సాగు చేస్తున్న ప్రతి ఆదివాసి రైతులకు పట్టాలు అందించాలని మండలంలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వరరావు సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు ఎలమంచి రవికుమార్ కే బ్రహ్మచారి మండల కార్యదర్శి కారం పుల్లయ్య వంశీకృష్ణ చంద్రయ్య చిలకమ్మా తిరుపతిరావు కనకదుర్గ మీడియం జయ తదితరులు పాల్గొన్నారు