UPDATES  

 సిపిఐ ప్రజా పోరు యాత్రలు జయప్రదం చేయండి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

దేశ సమగ్రత సమైక్యత కోసం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర అభివృద్ధిని కోరుతూ… సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న ప్రజాపోరు యాత్రను జయప్రదం చేయాలని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి ,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై. శ్రీనివాసరెడ్డి సిపిఐ శ్రేణులకు ,ప్రజా సంఘాలకు పిలుపునిచ్చారు. ప్రజా పోరు యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో కూలీ లైన్ తో పాటుగా వివిధ బస్తీలు.. వార్డుల్లో జరిగిన గ్రూప్ సమావేశాలలో శ్రీనివాస్ రెడ్డి పాల్గొని వాల్ పోస్టర్స్ విడుదల చేసి కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ,రాజ్యాంగంలొ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం , పేద ప్రజలకు కల్పించిన హక్కులను అమలు చేయాలని, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఆసరా పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు, పట్టాలు, ఇండ్ల నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు, ప్రతి రోజు మంచినీళ్లు, డ్వాక్రా గ్రూపు మహిళలకు వడ్డీ లేని పది లక్షల రూపాయల రుణాలు పోడు భూములకు పట్టాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు , దళిత బంధు తో పాటు రైతుల సంక్షేమం గిట్టుబాటు ధరలు.. పేదలందరికీ 10 లక్షలు పేదల బందు ఇవ్వాలని..నూతన పరిశ్రమలు, కొత్తగూడెం కేంద్రంగా ఐటి హబ్, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం, వంట గ్యాసు పెట్రోలు డీజిల్అధిక ధరలు తగ్గించాలని… తదితర సబ్బంఢ వర్గాల సంక్షేమం కోసం సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈనెల 14 నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సిపిఐ ప్రజా పోరు యాత్రలు సాగుతున్నాయని ఈ యాత్ర ఈనెల 20న కొత్తగూడెం గౌతమ్ పూర్ చేరుకొని రామవరం మీదుగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ వరకు భారీ బైక్ ర్యాలీ , బహిరంగ సభ జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కొత్తగూడెం పట్టణ సిపిఐ శ్రేణులకు ఆ పార్టీ పట్టణ కార్యదర్శి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై. శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గడ్డం రాజయ్య, మోతుకూరి శంకర్ ,గడ్డం ప్రభాకర్, చిలుక కృష్ణ, మరాటి మోహన్, మామిడిపల్లి రఘు ,బోయిన సత్యనారాయణ, మహంకాళి నారాయణ, కుంట రవీందర్ ,రమేష్ బాబు ,రాములు, అంజయ్య,బొల్లం చంద్రమౌళి ,గూడెపు కృష్ణ,ఎలగందుల రామకృష్ణ ,నజీర్, గౌస్, ఐలయ్య, హరినాథ్, కుప్పల శ్రీకాంత్, కే .కృష్ణ, రమేష్, మోహన్ రావు,మహిళా సమాఖ్య నాయకురాలు దాసరి జ్యోతి, పొట్లకాయల నాగమణి ,మిట్టపల్లి కల్పన, గూడెం నాగమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !