- చీమలపాడు అగ్నిప్రమాద ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
- ఎంపీ,ఎమ్మెల్యే పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
- విలేకరుల సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
మన్యం న్యూస్ ఇల్లందు టౌన్…
తెలంగాణ రాష్ట్రంలో తమదే అధికారం ఉందని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఏర్పాటు చేసిన నూతన బీఎస్పీ నియోజకవర్గ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు ఇర్పా రవికుమార్ తో కలిసి ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కామేష్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కారణంగా నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. అండబలం,ఆర్థిక బలం,అధికార బలం ఉన్నాయని బిఆర్ఎస్ ప్రభుత్వం విర్రవీగుదిగుతుందని ఆరోపించారు.మరికొద్ది నెలలోనే తెలంగాణలో అధికార మార్పిడి కచ్చితంగా జరిగి తీరుతుందని జోష్యం చెప్పారు.ఘటనలో క్షతగాత్రులకు 50 లక్షల ఆర్థిక సహాయంతో పాటు పూర్తి వైద్య ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని,అదేవిధంగా మృతిచెందిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఘటనకు తొలి ముద్దాయి టిఆర్ఎస్ ప్రభుత్వమని తొమ్మిదేళ్ల పాలనలో పేదలకు న్యాయం చేయలేక,తిరిగి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశ్యంతో దావతులు సమ్మేళనాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని,అమాయక ప్రజలు ,పేదలంతా ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా ఉండాలని,అధికార పార్టీ బెదిరింపులు,బుజ్జగింపులకు లొంగి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దన్నారు .స్థానిక ఎంపి మరియు ఎమ్మెల్యేపై హత్యానేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేయాలి.రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు రద్దు చేయాలని,విచ్చలవిడి మద్యం పంపిణీ,అనుమతి లేని బాణ సంచాల ప్రయోగాన్ని అరికట్టాలని డిమాండ్ చేయాలి.
ఆత్మీయ సమ్మేళనాలకు ఖర్చు చేసే డబ్బంతా ఎక్కడిదో,హైకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఇర్పా రవికుమార్,బాధవత్,ప్రతాప్,రాయల శ్రీనివాస్,తాచడి సత్యనారాయణ,లేతకులకాంతారావు,చిప్పలపల్లి శ్రీనివాసరావు,జ్యాన సుందరం తదితరులు పాల్గొన్నారు.
