UPDATES  

 పెండింగ్ లో ఉన్న రైతుబంధు నిధులు మంజూరు చేసినందుకు మంత్రికి కృతఙ్ఞతలు తెలిపిన బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు

 

మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఏప్రిల్ 17:ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలోని పెండింగ్ వున్న రైతులకు రైతుబంధు నిధులు మంజూరు చేయించినందుకు రైతుల పక్షాన మంత్రి పువ్వాడ కు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కు ధన్యవాదములు తెలియజేసిన బిఆర్ఎస్ నాయకులు వేముల హరీష్ రావు.ఈ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఐదు నుంచి పది ఎకరాలు లోపు ఉన్న రైతులకు పెండింగ్లో ఉన్న భూములకు సంబంధించిన రైతుబంధు నిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుమార్,ఎమ్మెల్యే మేచ్చా నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఈ సమస్యను ముఖ్య మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెల్లగ వారి మాటను గౌరవిస్తూ ముఖ్యమంత్రి వెంటనే పెండింగ్లో ఉన్న ఐదు నుంచి ఎకరాల రైతులకు నిధులను మంజూరు చేయటం వల్ల హర్షం వ్యక్తం చేసేరు.ఈ కార్యక్రమంలో మామిళ్ళపల్లి చిన్న లక్ష్మణరావు,అన్నపరెడ్డిపల్లి మం యువజన విభాగం అధ్యక్షుడు వద్ది వెంకటేష్.ఈ సందర్భంగా మేదర సంఘం జిల్లా కోశాధికారి సోమయ్య స్వయంగా తయారు చేసిన వస్తువులను మంత్రి కి బహుకరించి చేతి వృత్తులు చేసుకునే వారికి మరింత సహకారం అందించాలి అని కోరగా తప్పకుండా రుణాలు అందే విధంగా చర్యలు తీసుకుంటాను అని హామీ ఇవ్వడం జరిగింది చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !