మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
10వ తరగతి, ఇంటర్ ఓపెన్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్ ఓపెన్ పరీక్షలు నిర్వహణపై జిల్లా కేంద్రంలోని కొత్తగూడెంలో సోమవారం ఐడిఓసి కార్యాలయంలో విద్యా, రెవిన్యూ, పోలీస్, వైద్య,రవాణా, విద్యుత్, మిషన్ బగీరథ, పంచాయతీ, మున్సిపల్, ఆర్టీసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఓపెన్ పరీక్షలు నిర్వహణకు 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 1912 మంది విద్యార్థులు హాజరవుతున్నారని వీరిలో 562 మంది 10వ తరగతి, ఇంటర్మీడియట్
756 మంది రెగ్యులర్ మొత్తం 1318 విద్యార్థులని తెలిపారు. ఒకసారి ఫెయిల్ అయిన 284 మంది 10వ తరగతి, 310 ఇంటర్మీడియట్ విద్యార్థులు మొత్తం 594 మంది విద్యార్థులున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి మే నెల 4వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు మద్యాహ్నం2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పరీక్షాకేంద్రాల్లో సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ విధించాలని
తహసిల్దారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు కానీ, విధులు నిర్వహించు సిబ్బందికి కానీ సెల్ఫోన్లు,ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతి లేదని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో అత్యవసర సేవలు నిర్వహణకుఅత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. చల్లని సురక్షిత మంచినీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్,
పంచాయతీ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని
చెప్పారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్సు కేంద్రాలను మూసి వేయించాలని చెప్పారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద బస్సులు నిలుపుదల
చేయువిధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. 9 మంది ఛీఫ్ సూపరింటెంట్లు, 9 మందిడిపార్ట్మెంటల్ అధికారులు, 96 మంది ఇన్విజిలేటర్లును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కుఅవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందిగా నిర్వహించాలని చెప్పారు. 2 సిట్టింగ్, 2 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షన
చేస్తాయని చెప్పారు. ఈ సంవత్సరం నిర్వహించిన ఇంటర్మీడియట్, 10వ తరగతి పరీక్షలు ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించామని, అలాగే 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలు ఎలాంటి మాల్
ప్రాక్టీసెస్కు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నా, జవాబు పత్రాలు తరలించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన పేర్కొన్నారు.
సమావేశంలో డిఆర్డీ అశోకచక్రవర్తి, పరీక్షల సహాయ కమిషనర్ మాధవరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్
శిరీష, ఆర్టీఓ వేణు, విద్యుత్ శాఖ డిఈ వెంకటరత్నం, పోస్టల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.