మన్యం న్యూస్ చర్ల :
చర్ల మండల కేంద్రంలో సిఐటి యు ఆధ్వర్యంలో ఐకెపి వి.ఓ.ఎ లు చేపట్టిన నిరవదిక సమ్మెకు స్థానిక ఎమ్మెల్యే పోదెం వీరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సంపూర్ణ సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ఐకెపి ఉద్యోగులుగా, సంఘాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ గుర్తింపు లేకుండా వెట్టిచాకిరి చేస్తూ, అతి తక్కువ జీతంతో పని చేయించుకుంటున్న, ప్రభుత్వానికి కనింపు అయ్యే విధంగా ఐకెపి వి. ఓ. ఎ ల, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ మెడలు వంచి పరిష్కారం అయ్యే విధంగా నావంతు బాధ్యతగా అసెంబ్లీలో గొంతు ఎత్తుతానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పిసిసి మెంబర్ నల్లపు దుర్గ ప్రసాద్, ఎంపీటీసీలు మడకం పద్మజ, జ్యోతి,పులిగుండాల సర్పంచి చలపతిరావు,గుడపాటి సతీష్, తదితరులు పాల్గొన్నారు.
