మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.
నూగూర్ వెంకటాపురం
మండలంలోని మరికాల ఇసుక ర్యాంపు అక్రమాలకు
నే లవుగా మారింది. మొదటి నుంచి ర్యాంపులో అనుమతులకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి.
ర్యాంపు నిర్వహణ కోసం రహదారి నిర్మాణానికి వారు వాడిన గ్రావెల్ మట్టి కి పిసా చట్టాలు అమలులో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలలో అనుమతులు ఏ శాఖ అధికారులు అందజేశారు అసలు నియమ నిబంధనలతోనే నడిసాయ..? అది ఫారెస్ట్ దా రెవెన్యూ దో అంతు చిక్కడం లేదు. ఎవరికి తోచినంత వారు మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయం పై సదరు ఫారెస్ట్ అధికారులను సంప్రదించగా మాది కాదంటే మాది కాదు అని చేతులు దులుపుకుంటున్నారు. అది ఏ భూమి అయినా అధికారులను అనుమతి తీసుకొని తోలకాలు చేపట్టవలసిన అవసరం ఉంది. కానీ ఇక్కడ జరిగే పరిస్థితిలో దానికి విరుద్ధంగా ఉన్నట్టు పలువురు విమర్శిస్తున్నారు. ఇంకా లోతుకు వెళ్తే రాంపులో టాక్టర్ల తో సొసైటీ సభ్యులు పనులు చేపట్టవలసి ఉండగా గుత్తేదారులు ఏకంగా హెవీ మిషనరీ సాయంతో గోదారిలోనికి లారీలను తీసుకొని పోయి నింపి రాంప్ పరిధిలోని మైదానంలో బయట డంప్ చేస్తున్నారు.
ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి, అయినప్పటికీ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ర్యాంపు నిర్వహణ నిబంధన ప్రకారం రాంపు పని జరిగే చోట సీసీ కెమెరాలను అమర్చాలని ఉన్నత అధికారులు చెప్పినప్పటికీ ఎక్కడ సీసీ కెమెరాలు అమర్చిన దాఖలు లేవు. ఇష్ట రాజ్యాంగ రాత్రి పగలు తేడా లేకుండా…! ఇసుక విక్రయాలకు తెర లేపారు. టిఎస్ఎండిసి సంబంధించిన వ్యక్తులు పరిరక్షణలోనే ర్యాంపు పనులు చేయవలసి ఉండగా వారు లేకున్నా అడ్డగోలుగా ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారు.
గిరిజనులకు లబ్ధి చేకూరాలని సదుద్దేశంతో ప్రభుత్వం ఇసుక పాలసీ తీసుకువచ్చినప్పటికిని ఆదివాసులకు ఎటువంటి లబ్ధి చేకూరడం లేదు.
బినామీ ఆదివాసీల పేర్లు చెప్పుకొని ఆంధ్ర నుంచి వచ్చిన రైసింగ్ కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకి స్థానికంగా ఉన్న పలు పార్టీ రాజకీయ నాయకులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి అండ తోని సదరు కాంట్రాక్టర్లు అక్రమాలకు తెర తీస్తున్నారు. ఈ రాంపులో ఇలా ఉండగా,ఇంకా కొన్ని రాంపుల్లో అయితే ఈ మధ్యకాలంలో ఇసుక ర్యాంపుల్లో కొత్తవరవడి కి గుత్తేదారులు శ్రీకారం చుట్టారు.
అక్రమాలకు పాల్పడుతున్న ఇసుక రాంపులలో జరిగేటి అక్రమాలను పూర్తి చిత్ర ఆధారాలతో బయటపెట్టేందుకు సొసైటీ సభ్యుల ద్వారా ర్యాంపు దగ్గరకు వెళ్లిన విలేకరులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టడానికి సైతం వెనకాడడం లేదు. వారిచేతనే దుస్సహసాలు చేయిస్తూ విలేకరులపై తప్పుడు ఆరోపణలు మహిళలతో చేయిస్తున్న వైనం కొన్ని రాంపుల్లో కనబడుతుంది .
అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ర్యాంపు దగ్గరకు వెళ్లిన విలేకరులను మహిళా సొసైటీ సభ్యులతో ర్యాంపు లోనికి రానీయకుండా చేస్తున్న ప్రయత్నం గతంలోనే మనం చూసాము.
వాస్తవాలను వెలుగులోనికి రానీయకుండా విలేకరులపై అవలంబిస్తున్న విధానాలు అత్యంత దౌర్భాగ్యం. అయినా కూడా గిరిజనుల లబ్ధి విషయమై విలేకరులు ఎవరికిఏ మాత్రం భయపడకుండా ఆదివాసులు బలుగు బలహీన వెనకబడ్డ వారి కోసం పాటుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిబంధనలో మేరకు ర్యాంపు నిర్వహిస్తే ఆయా గ్రామ పంచాయతీలలో స్థానికంగా ఉండే రైతుల ట్రాక్టర్లకు, డ్రైవర్లకు కూలీలకు తదితరులకు ఉపాధి లభిస్తుంది.ఈ విషయం పరిగణలకు తీసుకొని సంబంధించిన శాఖ ఉన్నత అధికారులు చర్యలు తీసుకొని రాంపు నిబంధనలు మేరకు నడిచేలా కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ప్రజా శ్రేయస్సు కోసం నియమించబడ్డ సొసైటీ పథకాలను సైతం కాసుల ఎర్రచూపి అడ్డదారులతోకిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పత్రికా ముఖంగా తెలియజేస్తున్నారు.