మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం జరిగిన గిరిజన దర్బారులో దరఖాస్తులను ప్రాజెక్టు అధికారి అంకిత్ స్వయంగా స్వీకరించి, గిరిజన దర్బార్ లో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఉన్నత అధికారులను ఆదేశించారు.ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలం కంతనపల్లి గ్రామానికి చెందిన రైతులు తమకు గతంలో మంజూరైన బోర్లను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని వినతి పత్రం అందజేశారు.ఏటూరు నాగారం మండలం అల్లవారి ఘనపూర్ గ్రామానికి చెందిన రైతులు 2016-17 సంవత్సరంలో గ్రౌండ్ వాటర్ ద్వారా వేయించిన బోర్లకు కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు.ఏటూరు నాగారం మండల ముళ్ళకట్ట గ్రామానికీ చెందిన రైతులు ముళ్ళకట్ట చివరిలో 1997లో సుమారు 60 ఎకరాల భూమిని ఐటీడీఏ ద్వారా 40 మంది ఆదివాసీలకు ఇచ్చినది కానీ దానిలో 33 మంది రైతులకు ధరణిలో ఎక్కించి పాసు బుక్కులు ఇచ్చారు.మిగతా 7మంది రైతులకు పట్టా పాస్ బుక్కులు ఇప్పించి ధరణిలో ఎక్కించాలని వినతి పత్రం అందజేశారు.కన్నాయి గూడెం మండలం ఐలాపురం సర్పంచ్ మల్లెల రాజేశ్వరి తమ గ్రామం ఐలాపురం నుండి కొండాయి గ్రామం వరకు ఉన్న రోడ్డు కు గ్రావెల్ మంజూరు చెయ్యగలరని ప్రాజెక్ట్ అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏపివో వసంత రావు,ఎస్ వో రాజ్ కుమార్,పి హెచ్ వో రమణ,అగ్రికల్చర్ ఆఫీసర్ భారతి,జిసిసి డిఎం ప్రతాపరెడ్డి,ఐటీడీఏ మేనేజర్ శ్రీనివాస్ వివిధ సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.