UPDATES  

 మాజీ ఎంపీ పొంగులేటి వర్గీయులు మూకుమ్మడిగా బిఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు……

 

మన్యం న్యూస్ చండ్రుగొండ ఏప్రిల్ 17 : మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించారు. సోమవారం స్థానిక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించి రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బానోతి పార్వతితో పాటు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ… మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని బిఆర్ ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ బి ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పొంగులేటి తీసుకునే రాజకీయ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు వైఖరి నచ్చక పార్టీని వీడుతున్నామన్నారు .ఎమ్మెల్యే మెచ్చ వైఖరి జిల్లా పార్టీకి చెప్పిన పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సరైనా నాయకుడు పొంగులేటి అని గుర్తించి ఆయన వెంట ఉండేందుకు నిర్ణయించుకున్నామన్నారు. ప్రజాప్రతినిధులు అయినా మేము పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వలేదని వారన్నారు 2024లో జరిగే ఎన్నికల్లో జారే ఆదినారాయణను గెలిపించుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ,వైస్ ఎంపీపీ నరకుళ్ళ సత్యనారాయణ,సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, ఎంపీటీసీ సంగోడి వెంకటకుమారి, మాజీ జిల్లా రైతు సమితి అధ్యక్షుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి,మాజీ జెఎసి అధ్యక్షుడు సారేపల్లి శేఖర్, సొసైటీ డైరెక్టర్ పసుపులేటి వెంకటేశ్వర్లు,కిరణ్ రెడ్డి, నున్న వెంకటేశ్వర్లు, నరుకుల్ల అప్పాజీ,శంకర్,రాముడు, ప్రసాద్, రాందాస్, కిషన్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !