మన్యం న్యూస్,ఇల్లందు టౌన్..ఇల్లందు పట్టణంలోని రెండవ నెంబర్ బస్తి ఎనిమిదవ వార్డుకు చెందిన అనందేసి కావ్యశ్రీ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో కావ్యశ్రీ తండ్రికి సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.2.50 లక్షల ఎల్ఓసీ చెక్కును సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఇల్లందు ఏఎంసీ చైర్మన్ బానోత్ హరిసింగ్ నాయక్ లబ్ధిదారుని కుటుంబానికి అందచేశారు. ఈ సందర్భంగా హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని బాధిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందువుగా ఆపన్నహస్తం అందించి ఆదుకుంటుందని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థికసాయం బాధితులకు అందించటం గొప్ప విషయమని పేర్కొన్నారు.