జిల్లా అధికార ప్రతినిధి భవాని శంకర్
మన్యం న్యూస్ గుండాల… పరిధిలోని ఏపీ ఆర్ నుంచి మఠం లంక గ్రామం వరకు కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ సోమవారం పేర్కొన్నారు. ఆయన మన్యం న్యూస్ తో మాట్లాడుతూ మఠం లంక రహదారి కోసం ఎందరో హామీలకే పరిమితమయ్యారు తప్ప ఏ ఒక్కరు కూడా రహదారి మంజూరు చేయించడంలో పురోగతి సాధించ లేదన్నారు. రేగా కాంతారావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రత్యేక దృష్టి సారించి వంతెనలతో పాటు రహదారికి కూడా నిధులు మంజూరు చేయించిన ఘనత ఆయనకు ఉందన్నారు. మాటలు చెప్పే నాయకుడు కాదని హామీ ఇచ్చాడంటే నెరవేర్చే నేత రేగా కాంతారావు అని ఆయన అన్నారు. అతి త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు
