మన్యం న్యూస్, మణుగూరు, ఏప్రిల్ 17: మణుగూరు మండల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సోమవారం సంఘ కార్యాలయం ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘ మండల కార్యదర్శి గాండ్ల సురేష్ మాట్లాడుతూ ఎండలు విపరీతంగా పెరిగాయని, ప్రజల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో సంతోశంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కుర్రి నాగేశ్వరరావు,వలసాల వెంకట రామారావు, గాజుల రమేష్, బేతంచర్ల వెంకటేశ్వర్లు, ఎడవల్లి వెంకటయ్య, గువ్వా రాంబాబు, ఊట్కూరు సత్యనారాయణ, మాదాసు సాయిబాబా,మేడ నాగేశ్వరరావు, పూజారి చందు, జక్కం రంజిత్, కాట్రాగడ్డ సురేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
