మన్యం న్యూస్, దుమ్ముగూడెం::
రైతులు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎంపీపీ రేసు లక్ష్మి జడ్పిటిసి తెల్లం సీతమ్మ సూచించారు మండలంలోని కే లక్ష్మీపురం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు వారు పండించిన పంటను కొనుగోలు కేంద్రంలో తీసుకువచ్చి మద్దతు ధరకు అమ్ముకోవాల్సిందిగా సూచించారు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రం నిర్వహించాలని అధికారులకు తెలిపారు ధాన్యం తేమశాతం 17% లోపు ఉంటే మీ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సెంటర్ వద్ద ధాన్యం కొనుగోలు విక్రయించుకోవచ్చని ధాన్యం టోకెన్ కొరకు మండల వ్యవసాయ అధికారి దగ్గర టోకెన్ తీసుకోవాల్సిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెదనాల్లబల్లి సర్పంచ్ మట్ట వెంకటేశ్వరరావు గౌరవరం సర్పంచ్ జ్యోతి పర్ణశాల ఎంపిటిసి తెల్లం భీమరాజు ఏవో నవీన్ కుమార్ వ్యవసాయ సహకార సంఘం సీఈవో ముత్తయ్య సిబ్బంది గంగరాజు రైతులు తదితరులు పాల్గొన్నారు.