- వివోఏ ల నిరవధిక సమ్మె
- న్యాయపరమైన తమ డిమాండ్లు నెరవేర్చాలి
- న్యాయం జరిగే వరకు నిరవధిక సమ్మె తప్పదు
మన్యం న్యూస్, పినపాక:
న్యాయపరమైన తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోని, పరిష్కారం చూపించాలని పినపాక మండల వివోఏ ల సంఘం సోమవారం నుంచి నిరవధిక సమ్మెను సిఐటియు జిల్లా నాయకులు ఉప్పతల నరసింహారావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 17వ తారీకు నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభిస్తున్నామని చాలీచాలని జీతంతో చాలా సంవత్సరాల నుంచి వివో ఏలు తమ జీవితాలను గడుపుతున్నారని, కుటుంబ పోషణకు చాలా కష్టంగా ఉందని తెలియజేశారు. ఐకెపి వివోఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, 26 వేల కనీస వేతనం చెల్లించి, 10 లక్షల రూపాయల సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. ఆన్లైన్ పనులను కూడా చేయించడంతో మానసికంగా అలసిపోతున్నారని అన్నారు. అర్హులైన వివోఏ లను సిసిలుగా పదవోన్నతి కల్పించాలని కోరారు. న్యాయం జరిగే వరకూ నిరవధిక సమ్మెను ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు పండ్రమీషు నాగ ప్రమీల, కార్యదర్శి ఎక్కంటి వీరలక్ష్మి , కోశాధికారి ఇనపాల సునీత , ఉపాధ్యక్షురాలు కూరాకుల ఝాన్సీ రాణి, సహాయ కార్యదర్శి బందెల శ్రీనివాస్, ఉండం బాబురావు, ఇతర వివోఏలు పాల్గొన్నారు.