మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు వారసత్వం దినోత్సవం సందర్భంగా శిల్పం,వర్ణం,కృష్ణం పేరుతో నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ మధ్యాహ్నం రామప్పకు చేరుకున్నారు.ఈ సందర్భంగా మంత్రికి రామప్ప దేవాలయం ప్రాంగణంలో చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య వివరించారు.అనంతరం రామప్ప ఉత్సవాలపై మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడగా రామప్ప కట్టడం యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకోవడం భారతీయులందరికీ గర్వకారణం అని అన్నారు. రామప్పకు వారసత్వ ఇవ్వడం ద్వారా 800 సంవత్సరాల నాటి రామప్ప దేవాలయానికి తగిన గుర్తింపు లభించిందని అన్నారు.ఈ సందర్భంగా మంత్రి ప్రముఖ సినీ వాయిద్య కళాకారుడు శివమణితో కలితో డ్రమ్స్ వాయిస్తూ ఎంజాయ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య,అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి,జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్,డిఆర్ఓ రమాదేవి,అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
