మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 18: తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అశ్వారావుపేట మండల కేంద్రంలో పాత మండల పరిషత్ కార్యాలయం వద్దా సీఐటీయూ ఆధ్వర్యంలో ఐకెపి వీఓఏల నిర్వదిక సమ్మె మంగళవారం రెండవ రోజు కొనసాగుతోంది. ఈ సమ్మెతో అధికారులు దిగివచ్చి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేకుంటే అప్పటివరకు సమ్మె కొనసాగుతుందని ఐకేపీ వీఓఏ మండల అధ్యక్షురాలు షాహినా, జయలక్ష్మి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బేబీ, శివకుమారి, బుజ్జి, దుర్గా భవాని, సువార్త, పార్వతి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.