మన్యం న్యూస్: జూలూరుపాడు, ఏప్రిల్ 18, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం మంగళవారం మండల పరిధిలోని పాపకొల్లు గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రారంభమైంది. కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బాదావత్ లక్ష్మి, ఎంపీపీ సోనీ, ఎంపీటీసీ స్వాతి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు అందిస్తున్న ఉచిత సేవలను గ్రామస్తులంతా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ రాకేష్ కుమార్, గ్రామ పాలకమండలి సభ్యులు రామిశెట్టి రాంబాబు, రాయి హైమావతి, రామనాథం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.