UPDATES  

 కొత్తగూడెంలో ఇఫ్తార్ విందులో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ వ్యాఖ్యలు

  • వివాదాస్పద వ్యాఖ్యలతో
  • ఎత్తు”గడల” తాయత్తు ప్రయత్నం
  • చిన్నప్పుడు కట్టుకున్న రాగి తాయత్తు బతికించింది
  • కొత్తగూడెంలో ఇఫ్తార్ విందులో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ వ్యాఖ్యలు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ఆ అబ్బాయి చేతులో ఏముంది గొడుగు.. ఎలా చెప్పావు… అంతా తాయత్తు మహిమ… ముసలోడి నోట్లో ఏముంది.. పొడవాటి చుట్ట ఉంది.. ఎలా చెప్పావ్… అంతా తాయత్తు మహిమ.. ఆ అమ్మాయి చేతికి ఏముంది.. ఖరీదైన గడియారం ఉంది.. ఎలా చెప్పావు… అంతా తాయత్తు మహిమ… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఏముంది.. కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్ఎస్ సీటు గడలకు ఖాయమైంది… ఎట్లా చెప్పావు… అంతా తాయత్తు మహిమ.. ఈ డైలాగులన్నీ ఎక్కడో గారడీలో ప్రజలను బురిడీ కొట్టించే క్రమంలో వాడిన పదాలు లాగా ఉన్నాయి కదూ. అలాంటి పదాన్నే స్వయంగా తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం కే సి ఓ ఏ క్లబ్ లో ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జి ఎస్ ఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు మరోసారి సంచలమైన వ్యాఖ్యలు వార్తలకు ఎక్కారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కనుగుణంగా చేపట్టే పండుగలు అంటే తనకి ఇష్టమని.. ఆచరించే సాంప్రదాయ పద్ధతులు అంటే మరింత ఇష్టమని అన్నారు. జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడుతూ… ఆయన చిన్నతనంలో జ్వరము వస్తే.. ఆయన తల్లి గారు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చినా రాగి తాయత్తు చేతికి కడితే.. ఆ తాయత్తు వల్లనే తాను బతికి బయటపడ్డానని వ్యాఖ్యానించడం సభాస్థలిలో ప్రతి ఒక్కరు నేవ్వర పోయారు. కావాలనే రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ప్రసారం మాధ్యమాల్లో తాను ప్రథముడిగా నిలవాలని కావాలని కొన్ని సందర్భాల్లో గతి తప్పి మాట్లాడుతున్నట్లు కనపడుతుంది. ఆయన మాట్లాడే సంచలమైన వ్యాఖ్యలు అతనికి అనుకొని ప్రచారాన్ని తెచ్చిపెడుతున్నాయని నమ్మకంతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనపడుతుంది. కొత్తగూడెం నియోజకవర్గంలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో జి ఎస్ ఆర్ ట్రస్టు సేవ పేరుతో ఎన్నో సంచలమైన వ్యాఖ్యలు చేసిన గడల పలు వివాదాలను ఎదుర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మచ్చుకు కొన్ని పరిశీలిస్తే ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. సుజాతనగర్ మండలంలో ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో ఎండుమిర్చితో చేసిన తాంత్రిక పూజల్లో ఆయన పాల్గొనటం.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమే కాపాడే బతుకమ్మ ఆటల్లో డీజే టిల్లు పాటకు స్టెప్పులు వేయడం… క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఏసుక్రీస్తు దయవలనే కరోనా మహమ్మారి తగ్గిపోయిందని వైద్యుల చేతులు ఏమీ లేదని పేర్కొనటం వివాదాస్పదమైంది. ఇటీవల కాలంలో జర్నలిస్టులకు జరిగిన శిక్షణ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ గన్ను పట్టుకుని అడవికి వెళ్లాల్సిన వాడిని స్కెతస్కుబ్ పట్టుకొని వైద్యరంగంలోకి రావాల్సి వచ్చిందని పేర్కొనడం సంచలనం రేపింది. తాజాగా సోమవారం కొత్తగూడెంలో జరిగిన ఇఫ్తార్ విందులో మాట్లాడుతూ తాను తాయత్తు దయ వల్లే బతికి బట్టకట్టానని పేర్కొనడం సంచలనం అయ్యింది. వీటిని బట్టి చూస్తే రాష్ట్ర హెల్త్ డైరెక్టర్గా ఉన్న గడల శ్రీనివాస్ అవగాహన లోపమా… అత్యుత్సాహమా.. రాజకీయాలకి వస్తూ తాను కొత్తగూడెం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆలోచన పరిజ్ఞానంతో అడుగు ముందుకు వేయటమా తెలియదు గాని హాట్ టాపిక్ గా మారుతున్న గడల మాటలు కొందరి హృదయాలకు మీ గడలా అల్లుకుంటున్న మరికొందరికి మింగుడు పడకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రిలో సరైన మౌలిక సదుపాయాలు లేక రోగులు అవస్థలు పడుతున్నప్పటికీ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా ఆ సమస్యలపై దృష్టి సారించకుండా సేవా ముసుగులో చేస్తున్న సిల్లీ కార్యక్రమాలు గల్లి గల్లి లో చర్చంశ నియమవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా ఉన్న గడల ప్రజలు ఆశీర్వదిస్తే రాజకీయాల్లో కొచ్చి కొత్తగూడెం ని మరో “కొత్త” గూడెం గా మారుస్తానని.. చెప్పడం విశేషం గడలకు ప్రజల నుంచి అనుకున్న మద్దతు లభిస్తుందా… అనేది వేచి చూడాల్సిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !