మన్యం న్యూస్, మణుగూరు, ఏప్రిల్ 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని మణుగూరు జడ్పిటీసి పోశం నర్సింహారావు అన్నారు. ఆయన మంగళవారం మణుగూరు మున్సిపాలిటీలో ఈ నెల 20 వ తేదీన నిర్వహించే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ విజయవంతానికి ముఖ్యనాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల ప్రకారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించాలన్నారు. కార్యకర్తలకు ఎలాంటి లోటు లేకుండా నాయకులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మణుగూరు పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్, ఆవుల నర్సింహారావు, రమణ, సృజన్, కోటి, హరిప్రసాద్, లక్ష్మయ్య, సంజీవరావ్, రఘు, భూమయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
