కళ్ళుండి చూడలేని కబోదిలారా!
సాయం లేనిదే బయటకు కదలని పాయం!
ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు అభివృద్ధి మరిచారు
ఫేస్బుక్ సాక్షిగా రేగా తిట్ల దండకం…
మన్యం న్యూస్, ప్రతినిధి:
కేసిఆర్ పరిపాలనలో తెలంగాణలో నూతన శకం ప్రారంభమైందని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫేస్బుక్ సాక్షిగా తెలియజేశారు. గ్రామపంచాయతీ మొదలుకొని జిల్లా పాలన వరకు నూతన భవనాలను నిర్మించిన ఘనత కెసిఆర్ ది అని, పాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్ దే అని అన్నారు. గత ప్రభుత్వాల పరిపాలనలో అభివృద్ధి గురించి ఆనవాళ్లే లేవని తెలియజేశారు. పాయంకు సాయంగా ఎవరూ లేనిదే బయటకు పోలేడని, ఇంకా అతడు అమ్మకుచ్చి అని అన్నారు. అలాంటివారి పాలనలో అభివృద్ధి చూశామా అని ప్రశ్నించారు. పైపెచ్చు పార్టీకి రాజీనామా చేస్తున్నామని ఎటకారం. పనిచేస్తాడని పట్టం కడితే, కాసుల కోసం కక్కుర్తి పడి, అభివృద్ధిని మరిచినాడని అన్నారు. స్వయంగా నా పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలే గమనించి చర్చించుకోవాలని రేగా కాంతారావు తెలియజేశారు. ఒకేసారి 100 కోట్ల నిధులు తెచ్చిన ఘనత నాదే అని, ఆ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు.