మన్యంన్యూస్,టేకులపల్లి:టేకులపల్లి ప్రాధమిక పాఠశాలలో పనిచేసిన యూటీఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి రాళ్లబండి రామకృష్ణరాజు ద్వితీయ వర్ధంతి సభకు గిరిజన ఉద్యోగుల సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షులు వాంకుడోత్ హతీరామ్ నాయక్ హాజరయ్యారు. అనంతరం వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేసారు. ఈకార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి. కిషోర్సింగ్, రాష్ట్ర కార్యదర్శి రాజు, టేకులపల్లి ఎంఈఓ రాంసింగ్, ఉపాధ్యాయులు రాంజీ, నర్సింహారావు, వరలక్ష్మి, జానకి, జ్యోతి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
