మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:గత నెల రోజులుగా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అత్యంత నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో రోజాను పాటిస్తున్న ఇల్లందు పట్టణ ముస్లిం సోదరులకు ఆంబజార్ లోని జామా మసీదులో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి.రవి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. అల్లా దేవుని ఆశీస్సులు పట్టణ ప్రజలందరిపై ఉండాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు ఇస్లాం మతపెద్దలు, కాసిం, పాషా, అక్రమ్, రియాజ్, రంజాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసిక తిరుమల్, ఇబ్రహీం, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ అరవిందస్వామి, రవి తదితరులు పాల్గొన్నారు.
