మన్యం న్యూస్ గార్ల: ఐకేపి, విఓఏల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత మూడురోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున సిబ్బందికి స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ళపల్లి కృష్ణ గౌడ్, జాతీయ శ్రీశక్తి అవార్డ్ గ్రహీత సంసద్ బేగంలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాలీచాలని జీతాలతో ఏళ్ల తరబడి సేవలు అందించిన విఓఏలకు ఉద్యోగ భద్రత, భీమా సౌకర్యం కల్పించి వారిని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని పేర్కొన్నారు. 26వేల రూపాయల కనీస జీతాలు ఇవ్వాలని తెలిపారు.అదేవిధంగా వారి సమస్యలు పరిష్కరించే వరకు మా పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ సంఘీభావ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జవహర్ లాల్ నెహ్రూ, బపనపల్లి సుందర్, దీకొండ రాము, గుగులోత్ హరి, మహిళా నాయకులు బానోత్ కమల, మెరుగు వినోద, ఆస్మత, నాని గౌడ్, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.
