మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటు మరణించడం జరుగుతుంది. దీనిపై ప్రజలకు సరైన అవగాహన లేక ప్రాథమిక చర్యలు చేపట్టక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తూoది ఇందులో భాగంగా దుమ్ముగూడెం పర్ణశాల నరసాపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ పుల్లారెడ్డి డాక్టర్ రేణుక రెడ్డి డాక్టర్ నిశాంత్ రావు ల ఆధ్వర్యంలో గుండెపోటు వస్తే తీసుకోవలసిన ప్రాథమిక చర్యలు సి పి ఆర్ ( కార్డియా ఫల్మనరి రిససీటేషన్) పై గ్రామపంచాయతీ కార్యదర్శులకు గ్రామీణ ఉపాధి హామీ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆకస్మిక గుండెపోటు గురించి వివరించారు సిపిఆర్ ఎలా చేయాలన్న దానిపై డాక్టర్ నిశాంత రావు వివరించడంతో పాటు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రత్యక్షంగా సిపిఆర్ చేయించి చూపించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యూని జేషన్ అధికారి డాక్టర్ బాలాజీ నాయక్ పర్యవేక్షించగా ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రమౌళి ఎంపీ ఓ ముత్యాలరావు సి ఆర్ పి ఎఫ్ డి.ఎస్.పి రేవతి సిఐ దోమల రమేష్ ఎస్ ఐ లు రవికుమార్ కేశవరావు గ్రామపంచాయతీ కార్యదర్శులు వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
