మన్యం న్యూస్, భద్రాచలం :
విద్యార్థులకు క్షేత్రస్థాయి సందర్శనలుఆలోచన శక్తిని పెంపొందిస్తాయని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డి.భద్రయ్య అన్నారు. బుధవారం భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఎస్సీ జీవశాస్త్రం తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను జంతు శాస్త్ర విభాగం, వృక్ష శాస్త్ర విభాగం సంయుక్తంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని పాతిమాలగూడెం ప్రాంతంలోని రాక్షస గుళ్ళు (సమాధులు )క్షేత్ర సందర్శనకు తీసుకొని వెళ్లడం జరిగినది. సుమారు 3వేల సంవత్సరాల క్రితం నిర్మించిన రాక్షస గుళ్ళు గురించి క్షేత్ర సందర్శనలో జంతు శాస్త్ర అధ్యాపకులు విద్యార్థులకు వివరించారు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న వృక్షజాతుల వైవిధ్యం పరిశీలించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డి.భద్రయ్య మాట్లాడుతూ… క్షేత్ర సందర్శనలు విద్యార్థుల ఆలోచన శక్తిని పెంపొందిస్తాయి అని పేర్కొన్నారు. ఈ క్షేత్ర సందర్శనలో జంతు శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఏ.శ్రీను, పి.దుర్గ భవాని, వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ ఎన్.నాగ సమీరా, జి.పావని, విద్యార్థులు పాల్గొన్నారు.