మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
ఐకెపి లో పనిచేస్తున్న వివోఏలతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తూ వారికి కనీస వేతనం అమలు చేయడం లేదని సిఐటియు దుమ్ముగూడెం మండల అధ్యక్షులు కొరసా చిలకమ్మ అన్నారు. సిఐటియు అనుబంధ వివోఏల నిరవధిక సమ్మె బుధవారం కి మూడో రోజుకు చేరుకోగా సమ్మె శిబిరంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివో ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించి సమ్మె విరమింపచేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ వస్తే కార్మికుల బతుకులు మారుతాయి అనుకుంటే బంగారు తెలంగాణలో కూడా కార్మికులకు కనీస వేతనం అమలు కాక ఆకలి కేకలు పస్తులతో గడిపే కుటుంబాలు కనిపిస్తున్నాయని అన్నారు వివో ఏలకు లకు 10లక్షల సాధారణ బీమా వర్తింప చేయాలి అని ఎస్ హెచ్ జి ఆన్లైన్ పనులు రద్దు చేయాల ని సెర్ప్ నుండి గుర్తింపు కార్డులు ఇవ్వాలి ని వివోఏలపై మహిళా సంఘం ల ఒత్తిడి ఎక్కువ ఉన్నందున స్వయం సహాయక గ్రూపులకు వి ఎల్ ఆర్ అభయ హస్తం డబ్బులు వాపస్ ఇవ్వాలి అని ప్రభుత్వం నీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో వివోఏల ల మండల కార్యదర్శి కె నాగరాజు గుట్టయ్యా కుమారి జె లత కృషవేణి దుర్గా వెంకటేష్ లక్ష్మి కిషన్ రాజేష్ రాజేశ్వరి రమాదేవి మని రాజు నరేంద్ర జి అరుణ వెంకటలక్ష్మి పాపమ్మ కమల మంగవేణి పద్మ తదితరులు పాల్గొన్నారు.