.
మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని టీ డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు భద్రాద్రి కొత్తగూడెం యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలం పట్టణంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం సిపిఐ కాంగ్రెస్ టిడిపి పార్టీలో చెందిన నాయకులు జర్నలిస్టుకు మద్దతుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎంబి నర్సారెడ్డి పట్టణ అధ్యక్షులు స్వామి మహిళా నాయకురాలు రేణుక సిపిఐ నాయకులు సునీల్ కాంగ్రెస్ నాయకులు నరేష్ సతీష్ టిడిపి నాయకులు అజీమ్ కుంచల రాజారాం టియుడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు తోటమల్ల బాలయోగి టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు వెంకటేశ్వరరావు రాష్ట్ర కమిటీ సభ్యులు రవికుమార్ కృష్ణ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు