మన్యం న్యూస్ గుండాల: న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె విరమించేదే లేదని వివో ఎలా ఆళ్లపల్లి మండల అధ్యక్షులు దొడ్డి రాము పేర్కొన్నారు. గత మూడు రోజులుగా మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని కోరారు. గుండాల మండలంలో జరుగుతున్న వివో ఎలా సమ్మెకు న్యూ డెమోక్రసీ పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. సమ్మె జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్న గుండాల ఎంపీపీ ముక్తి సత్యం మాట్లాడుతూ వివో ఎలా న్యాయమైన సమస్యలన్నిటిని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన అన్నారు. ఈ నిరవధిక సమ్మెలో వివోఏలు వెంకట్ నారాయణ ,విజయశ్రీ, నాగేశ్వరరావు, న్యూ డెమోక్రసీ నాయకులు పరిష్క రవి, మల్లన్న, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
