మన్యం న్యూస్ చండ్రుగొండ, ఏప్రిల్ 19: మోడి హటావో -దేశికి బచావో అనే నినాదంతో సిపిఐ జాతీయ స్థాయిలో ప్రజాపోరుయాత్రను చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా స్పష్టం చేశాడు. బుధవారం ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేసిన సిపిఐ ప్రజాపోరుయాత్ర బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.తొలుత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి సాబీర్ పాషా నివాలర్పించాడు. కేంద్ర ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసర సరుకుల ధరలు పెంచిందని విమర్శించారు. నూతన బొగ్గు బావులను కేంద్ర ప్రభుత్వం ఆదాని కంపెనీలకు అప్పనంగా అప్పగించాలని చూస్తుందని ఆరోపించాడు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా కేంద్ర చట్టాలను తేవాలని, ప్రవేటీకరణ విధనాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశాడు. అర్హులైన గిరిజన, గిరిజనేతర పోడుదారులకు
పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ సభలో సిపిఐ జిల్లా నాయకులు నరాటి ప్రసాద్, యార్లగడ్డ భాస్కర్రావు, లక్ష్మికుమారి, చంద్రగిరి శ్రీనివాసరావు, గార్లపాటి రామనాధం, బొర్రా కేశవులు, సిపిఎం మండల కార్యదర్సి ఐలూరి రాంరెడ్డి,టిడిపి జిల్లా నాయకులు వారాది సత్యనారాయణ, నాయకులు ఊకే నారాయణ, జడ శ్రీను, చంద్రకళ, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.