మన్యం, న్యూస్ మంగపేట.
మంగపేట మండలం లోని రాజుపేటను నూతన మండల ఏర్పాటు చేయాలని రాజుపేటలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ములుగు జిల్లా జేఏసీ అధ్యక్షులు ముంజాల బిక్షపతి అన్నారు.మాట్లాడుతూ అకినేపల్లి మల్లారం నుంచి చుంచుపల్లి వరకు, రాజుపేట మండలం చేయాలన్నారు. చింతకుంట, తక్కల్లగూడెం, బండారుగూడెం ,కత్తి గూడెం, దేవనగరం ప్రాంతాల నుంచి మంగపేట మండలానికి పోవడానికి చార్జీలు అధిక భారం పెరగటం వలన పేద మద్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏదైనా పని మీద మంగపేట మండలానికి పోయిన కానీ పనులు కాని పరిస్థితి ఉందని అన్నారు. రాజుపేట కేంద్రం గా మండలం ప్రకటిస్తే అందరికి సౌలభ్యంగా ఉంటుంది.ఇప్పటికైనా అధికారుల దృష్టిలో పెట్టుకొని రాజుపేట మండలం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేనియెడల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అందోళనలు,పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్, బాలు, రవితేజ, రఘు, సతీష్, రవి తదితరులు పాల్గొన్నారు