మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 19: అశ్వరావుపేట మండల కేంద్రంలో ఐకేపీ విఓఏ ల డిమాండ్ ల సాధన కోసం ధర్నాలు చేస్తున్న విఓఏలకు సంగిభావం తెలిపిన టీపీసీసీ సభ్యులు వగ్గేల పూజ, బుధవారం వారితో పాటు ధర్నా ప్రాంగణం లో కూర్చున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ ఏ సమస్య వచ్చిన రోడ్డు ఎక్కి యుద్ధం చేయవలిసిన పరిస్థితిని మనం చుస్తున్నాం అని, సరిగా 2002లో విఓఏలకు గ్రామ సంఘ పుస్తక నిర్వహణ పనులు అప్పగించి మరి ఈ రోజు మారుతున్నా టెక్నాలజీకి అనుగుణంగా ఆన్లైన్ వర్క్ లు చేపిస్తున్నారు, ప్రభుత్వ పథకాల అమలులో వీరిని భాగం చేస్తున్నారు, ఎన్నికల సమయంలో వీరితో పనులు చెపిస్తున్నారు కాబట్టి వీరిని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26000/- ఇవ్వాలని ప్రభుత్వని డిమాండ్ చేశారు. అంతే కాకుండా మహిళా సంఘాలకు మిగిలి వున్నా పావలా వడ్డీ లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అదేవిదంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి మరి అభయహస్తం లాంటి గొప్ప పథకాని తీసుకు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మహిళలు సంవత్సరానికి 385 రూపాల చొప్పున కొన్ని సంవత్సరాల పాటు కట్టుకొని పెన్షన్లు కూడా పొందారు అని గుర్తు చేశారు. కానీ ఈరోజు కేసీఆర్ దుర్మార్గ పాలన వచ్చిన తర్వాత పథకాన్ని రద్దుచేసి కనీసం వీళ్లు కట్టుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు, కాబట్టి ఉద్యోగులంతా కూడా రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడిందని, కావునా ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం అని, అది కెసిఆర్ ఉద్యోగుల డిమాండ్లు తీర్చలేక పోతే గద్దె దిగిపోవాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బూసి, పాండురంగ, బండారు మహేష్, వుకే ముత్తయ్య, చల్ల రమాదేవి, వజ్రమ్మా, ఐకేపీ విఓఏలు ఎస్కె సహిన, కృష్ణ కూమారి, రేవతి, శివకుమార్, బేబీ, భాగ్యలత తదితరులు పాల్గొన్నారు.