UPDATES  

 మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా రోగులకు పండ్లు,బ్రేడ్లు పంపిణి చేసిన బిఆర్ఎస్ నాయకులు

 

మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి ఏప్రిల్ 19: రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఇటీవల జరిగిన చీమలపాడు దుర్ఘటన నేపథ్యంలో మంత్రి వేడుకలకు దూరంగా ఉండాలి అని నిర్ణయించిన నేపథ్యంలో బిఆర్ఎస్ నాయకులు వేముల హరీష్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు వైద్య సిబ్బందితో కలిసి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య చికిత్సలు పొందుతున్న రోగులకు పండ్లు,బ్రెడ్లు పంచిపెట్టారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా నిరుపేదలకు మమత హాస్పిటల్స్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్న ఘనత వారికే దక్కిందని,అటువంటి ప్రజా నాయకుడు జన్మదినం సందర్భంగా వారి స్పూర్తితో హాస్పిటల్ లో రోగులకు పండ్లు,బ్రెడ్లు పంచిపెట్టడం జరిగిందని అన్నారు.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో కొనసాగాలనీ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మామిళ్ళపల్లి చిన్న లక్ష్మణరావు,వేముల భాస్కర్ రావు,వెంకటేశ్వర్లు,కొండలు,ఇమామ్,బషీద్,భేతి శివ,వద్ది నవీన్,సురేష్,పద్దం నవీన్,వైద్య సిబ్బంది డాక్టర్ శ్రీనివాస రెడ్డి,హెచ్.ఎన్ నాగమణి,ఎల్.టీ కిరణ్,ప్రసాద్,జ్యోతి,లక్ష్మి,బీఆర్ఎస్ కార్యకర్తలు,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !