యువకులు సేవలు అభినందనియం -ఎమ్మెల్యే మెచ్చా
మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 19: మండల పరిదిలోని గుమ్మడవల్లి గ్రామంలో పలువురు యువకులు యువ సేవ సమితిలో చేరి పేద ప్రజలకు పలు సేవలు, రక్తదాన సిబిరాలు ఏర్పాటు లాంటి పలు కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో వారిని గుర్తించిన ఎమ్మెల్యే మెచ్చా సేవా సమితి బృందాన్ని బుధవారం మెచ్చా వారి స్వగృహానికి పిలిపించి అభినందించారు. అనంతరం యువ సేవా సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తాళ్లూరి నాగ మురళి నియోజకవర్గంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి వివరించడం జరిగింది. నియోజకవర్గ శాసనసభ్యులు సహకారంతో ముందు ముందు నిరుపేదలకు అండగా సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. సేవా సమితికి మూల స్తంభాలు లాగా ఉన్నటువంటి తోటి సేవా సమితి సభ్యులు కోలేటి రాజు, నాగరాజు, పాయం కళ్యాణ్, షేక్ ఖలీద్, శ్రీరాములు ప్రభుదాసులను కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే మెచ్చా మేనల్లుడు ప్రదీప్, పిఆర్ఓ అబ్దుల్ పాల్గొని వారిని అభినందించారు. ఈ సందర్బంగా గుమ్మడవల్లి గ్రామ పెద్దలు పలువురు ప్రత్యేకంగా యువతను అభినందనలు తెలపడం జరిగింది.