బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ‘కోర్బె వాక్స్’ కరోనా వ్యాక్సీన్ ను బూస్టర్ డోస్ గా అందించనున్నట్లు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఐదు లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని, అర్హులైన వారు వ్యాక్సీన్ తీసుకోవాలని సూచించారు. మొదటి, రెండో డోసులు కోవాగ్జిన్, కొవిషీల్డ్…. వీటిలో ఏది తీసుకున్నప్పటికీ బూస్టర్ డోసుగా ‘కోర్బె వాక్స్’ వ్యాక్సీన్ ను తీసుకోవచ్చునని తెలిపారు