ఉన్నత చదువులు చదివి.. జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని 12 క్లాస్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న తమ మనుమడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఆశీర్వదించారు. మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలిలోని వోక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి 12వ క్లాస్ ను పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా తాను చదువుతున్న స్కూల్ లో ‘12 క్లాస్ గ్రాడ్యుయేషన్ డే’వేడుకలను ఏప్రిల్ 18వ తేదీ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత, నాయనమ్మలైన సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు, తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, చెల్లెలు అలేఖ్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.