UPDATES  

 ఐటి మంత్రి కేటీఆర్ ని కలిసిన ఇల్లందుఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్

 

మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:హైదరాబాదులోని ప్రగతి భవన్ నందు గల హెచ్ఎండిఎ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు మున్సిపల్ శాఖామంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావుని ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఇల్లందు ప్రాంతం కోల్ బెల్ట్ ప్రాంతం కావడంతో ఇల్లందు ప్రాంతంలో ఉన్న కోల్ బెల్ట్ ఏరియా సమస్యల గురించి మంత్రికి వివరించడం జరిగింది. అంతేకాకుండా ఇల్లందు మున్సిపాలిటీలో మరియు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి మంత్రి కేటీఆర్ కు వివరించి చర్చించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ సమస్యలపై, పలు అభివృద్ధి పనుల నిధులకొరకు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడం జరిగినట్లు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ తెలిపారు. ఇల్లందు నియోజకవర్గ ప్రగతి చూస్తున్నానని అభివృద్ధిలో ఇల్లందు దూసుకుపోతోందని కేటీఆర్ తెలిపినట్లు హరిప్రియ తెలిపారు. ఈ అభివృద్దే రానున్న ఎన్నికల్లో విజయానికి బాసటగా నిలుస్తుందని కేటీఆర్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధికై రాష్ట్రప్రభుత్వ సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయని కేటీఆర్ వెల్లడించినట్లు హరిప్రియ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఇల్లందు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇల్లందు ఉపాధ్యక్షులు ఎస్ రంగనాథ్, ఇల్లందు మండల జడ్పిటిసి ఉమాదేవి, ఇల్లందు పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి, ఇల్లందు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బర్మావత్ లాల్ సింగ్, టేకులపల్లి మండల ఉపాధ్యక్షుడు చీమల సత్యనారాయణ, సీనియర్ నాయకులు కళ్ళెం కోటిరెడ్డి తదితర నాయకులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !