- పోరాడేది దేశాన్ని రక్షించేది కమ్యూనిస్టులే.
- దేశాన్ని తెగనమ్ముతున్న మోడీ సర్కార్.
- ప్రశ్నించే గొంతుకులపై బిజెపి నిర్బంధకండి
- మతతత్వ పార్టీ నుండి దేశాన్ని రక్షించుకుందాం– సాంబశివరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శికూనంనేని
- జిల్లా సమగ్ర అభివృద్ధి కోసమే సీపీఐ ప్రజాపోరుయాత్ర– సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా*
- ఉత్తేజపూరిత వాతావరణంలో సిపిఐ ప్రజాపోరుయాత్ర బహిరంగ సభ.
- సిపిఐ ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిది
పోరాడేది దేశాన్ని రక్షించేది కమ్యూనిస్టులే అనీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాపోరుయాత్ర మంగళవారం పాల్వంచలోకి ప్రవేశించింది .ఈ సందర్భంగా స్థానిక అల్లూరి సెంటర్ వద్ద పాల్వంచ నాయకత్వం యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికింది. అనంతరం అల్లూరి సెంటర్ నటరాజ్ సెంటర్ శాస్త్రి రోడ్ రాజీవ్ గాంధీ మార్కెట్ బస్ స్టాండ్ భద్రాచలం రోడ్డు మీదుగా భారీ మోటార్ సైకిల్ ల ప్రదర్శనతో అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేశారు బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం అధ్యక్షతన ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యఅతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ పేదోడి పక్కన వారి సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాడేది దేశ లౌకిక సమగ్రతను కాపాడటం కోసం పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమేనని పునరాదటించారు. దేశంలో అధికారం చాలా ఇస్తున్న మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను దేశ సంపదలను తెగనమ్ముతూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాలకుల విధానాలు ప్రజలకు శాపంగా మారాయని, దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి సంపన్న వర్గాలకు కొమ్ముగాస్తూ పేదవాడిని కటిక దరిద్రులుగా మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామిక లౌకికవాదం పునాదులుగా రూపుదిద్దుకున్న భారతదేశం ఇప్పుడు బిజెపి వలన ప్రమాదంలో పడిందని అన్నారు. బిజెపి విధానాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి నిర్బంధాలు కొనసాగిస్తూ మత పిచ్చితో హత్యలుకు పాల్పడుతుందని ఆరోపించారు. మతతత్వ పార్టీ అయినా బిజెపి, సంపరివార్ శక్తుల నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, మతం పేరుతో దేశ ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందాలని బిజెపి చూస్తుందని, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపిని ఇంటికి పంపించటం ఒకే ఒక ఎజెండాతో బిజెపి కు హటావో దేశ్ కు బచావో నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా వామపక్షా, లౌకిక ప్రజా యాత్రను సిపిఐ నిర్వహిస్తుందని తెలిపారు.
అనంతరం ప్రజా పోరుయాత్ర రథసారథి, సిపిఐ జిల్లా కార్యదర్శి sk సాబీర్ పాషా మాట్లాడుతూ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాల్సిందేనని ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసమే సీపీఐ ప్రజాపోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు, జిల్లాలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులందరికీ పోడు పట్టాలివ్వాలని అనాదిగా పోడు సాగు చేసుకుంటున్న గిరిజినేతరులకు కూడా పోడు హక్కు కల్పించి రైతుబంధు పథకం వర్తింపచేయాలని, పోడు సాగుదారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, జిల్లాలో వ్యాప్తంగా పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని సొంత ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు నిధులు కేటాయించాలని, విభజన హామీలను అమలు చేయాలని, వలస ఆదివాసీలకు కుల నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు పేద ప్రజల పక్షాన సిపిఐ పోరాడుతుందని తెలిపారు. సిపిఐ దేశవ్యాప్త పిలుపులో భాగంగా విద్వేషాలతో పరిపాలన కొనసాగిస్తున్న బిజెపిని గద్దతించడంతోపాటు రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ప్రజాపోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు ఈ యాత్రను ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వర్లు, మున్న లక్ష్మీ కుమారి, ఏపూరి బ్రహ్మం, ఆకోజు సునీల్ కుమార్, చంద్రగిరి శ్రీనివాస, జిల్లా సమితి సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, అడ్సుమల్లి సాయిబాబా, ఉప్పుశెట్టి రాహుల్, వీ పద్మజ, బల్ల సాయికుమార్, విషంశెట్టి విశ్వేశ్వరరావు, అన్నారపు వెంకటేశ్వర్లు, శనగరపు శ్రీనివాస్, నరహరి నాగేశ్వరరావు, జ్యోతుల రమేష్, అశోక్, అజిత్, చంద్రకళ, నాయకులు రత్నకుమారి మువ్వా రామలక్ష్మి, ధనలక్ష్మి, నిర్మల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.