మణుగూరు టౌన్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పివి కాలనీ కమ్యూనిటీ హాల్ నందు ముస్లిం మైనారిటీ సోదరుల కోసం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని అన్నారు, ముస్లింలకు బిఆర్ఎస్ అండగా నిలుస్తున్నదని అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేదలకు ప్రభుత్వం కానుకలు పంపిణీ చేస్తున్నదన్నారు,తెలంగాణ సర్వమత సమ్మేళనాలకు నిలయమన్నారు, ఇక్కడ అన్ని వర్గాల ప్రజల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు సీఎం కేసీఆర్ ముస్లింలకు అండగా ఉన్నారన్నారు. ముస్లింలు భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకోవాలని కోరుతూ,రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.